Wednesday 7 September 2016

మాఘమాసం ఎప్పుడొస్తుందో



మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..
మంచు మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు చికు చిన్నోడోయమ్మా..

మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు చికు చిన్నోడోయమ్మా..

తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు...
ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు..
నా.. కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు..
లేతలేతగా సొంతమైనవి దోచాడే ఈనాడు..
ఓయమ్మో..ఆ..ఆ.. హాయమ్మా వలపులే తోలిరేయమ్మ వాటేస్తే..
చినవాడు నా సిగ్గు దాచేస్తే....

మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..
మంచు మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు చికు చిన్నోడోయమ్మా..

తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిల్లగాడు..
రాతిమనసున ప్రేమ అలికిడి చిలికాడే చినవోడు..
నా.. కంటిపాపకు కొంటె కలలను అలికాడే అతగాడు..
ఒంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడో..
ఓయమ్మా.. ఆ... వళ్ళంతా మనసులే.. ఈ తుళ్ళింత తెలుసులే..
పెళ్ళాడే శుభలగ్నం ఏనాడూ..

మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..
మంచు మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు చికు చిన్నోడోయమ్మా.

Album Egire Paavurama

Starring:Srikanth, J. D. Chakravarthy, Laila
Music :S. V. Krishna Reddy
Lyrics-
Singers :Sunitha
Producer:P. Usha Rani
Director:S. V. Krishna Reddy
Year:1997

Tuesday 6 September 2016

అటు నువ్వే ఇటు నువ్వే





అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే

అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైన ప్రతి మాట నువ్వే

అపుడు ఇపుడు ఎపుడైనా
నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే

పరిచయమంతా గతమేనా
గురుతుకు రాదా క్షణమైనా
ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావులే

రంగు రూపమంటూ  లేనే లేనిది ఈ ప్రేమ
చుట్టూ శూన్యం ఉన్నా నిన్ను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటూ తేడా  చూడదీ ప్రేమ
నీలా చెంత చేరి నన్ను ఆటాడిస్తుంది

కను పాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్ప పాటు కాలమైనా మరపే రావుగా
ఎద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై
నువ్వు లేని నేను లేనె లేను అనిపించావుగా

అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే

అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైన ప్రతి మాట నువ్వే

నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేశావే

ఏకాంత వేళలో ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలి లేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండలేదురా
నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదేలా

అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే

అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైన ప్రతి మాట నువ్వే


Album:Current

Starring:Sushanth, Sneha Ullal
Music :Devi Sri Prasad
Lyrics-Ramajogayya Sastry
Singers :Neha Bhasin
Producer:Naga Susheela, Chintalapudi Srinivasa Rao
Director:Palnati Surya Pratap

Year: 2009

Monday 5 September 2016

వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ...






వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ...
నిర్విఘ్నం కురుమే దేవ... సర్వకార్యేషు సర్వదా...
 ఆ.... ఆ...


జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వి
బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవా
మహిలో జనులకు మహిమలు చాటి
ఇహపరములనిడు మహానుభావా
ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చేగణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు
నిరతము పెరిగే మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్యప్రవూణం
ధర్మదేవతకు నిలుపును ప్రాణం
విజయకారణం విఘ్ననాశనం కాణిపాకలో నీ దర్శనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక


పిండిబొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండనాయకుడివైనావు
మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలోదాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని గూర్పగ లక్ష్మీగణపతివైనావు
వేద పురాణములఖిలశాస్త్రములు
కళలు చాటును నీవైభవం
వక్రతుండమె ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక...
ఆ... ఆ...

Album Devullu

Starring: Pruthvi Raj, Raasi
Music :Vandemataram Srinivas
Lyrics-Jonnavithhula Ramalingeswara Rao
Singers :SP Balu
Producer: Chegondi Haribabu, Karatam Rambabu
Director: Kodi Ramakrishna
Year: 2000

Sunday 4 September 2016

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా



మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
నీ రూపూ రేఖల్లోనా .. నేనుండీ వెలుగైపోనా
ఓ సోనా వెన్నెల సోనా.... నీ వాలే కన్నుల్లోనా
నా చిత్రం చిత్రించెయినా..కనుపాపైపోనా

నీవే తోడని నిజంగా..నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే..అయిపోయే ఇక క్షణమే
తెలుసా తెలుసా ఇది తెలుసా
మార్చేసావే నా ఈ వరసా
నువ్వు మార్చేసావే నా ఈ వరసా

ఓ సోనా వెన్నెల సోనా..రేపావే అల్లరి చానా
చెక్కిల్లో చుక్కైపోనా..చూపుల్తో చుట్టేసెయ్ నా
ఓ సోనా వెన్నెల సోనా..ముంగిట్లో ముగ్గైరానా
ముద్దుల్తో ముంచేసెయ్ నా..కౌగిలికే రానా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

కూసే కోయిల స్వయంగా..వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే..మౌనంగా మది మురిసే
కలిసా కలిసా నీతో కలిసా
నీలో నిండీ అన్నీ మరిచా
హో నీలో నిండీ అన్నీ మరిచా

ఓ సోనా వెన్నెల సోనా..నీవైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా..నా ఊసే పంపానమ్మా
ఓ సోనా వెన్నెల సోనా..నీ గుండె చప్పుల్లోనా
నా ప్రాణం నింపానమ్మా....నిను చేరానమ్మా !

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
ఓ మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా..నీ వాలే కన్నుల్లోనా

Album:Munna

Starring:Prabhas, Ileana
Music:Harris Jayaraj
Lyrics-Mailavarapu Gopi
Singers :Haricharan, Krish, Naresh Iyer, Sadhana Sargam
Producer:Dil Raju
Director:Vamsi Paidipalli
Year:2007

నిన్న నీవు నాకెంతొ దూరం


నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో...
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం..ప్రాణం.. ప్రాణం

కంటిలో పాపలా.. ఖతేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో...

నీలాల నింగి వంగి నేల చెవిలో ఇలా అంది
నీలాల నింగీ వంగీ నేల చెవిలో ఇలా అందీ
నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ..

ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది
ఆ ప్రేమ నాలో ఉందీ నీ పొందునే కోరుకుందీ
ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ..

పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నదీ హొయ్
సరిలేని సద్దుల్లో విడిపొని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ..

నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. నీడలా నాతో ఉండిపో... హొ

గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉంది హొయ్..
గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉందీ
నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ

కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
కార్తీక పున్నమిలోనా కాసింతషహాయే ఉందీ
ఏ వేళనైనా నీ నీడలోనా ఎనలేని హాయున్నదీ

కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్
చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్


నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా తేనెలో తీపిలా నీడలా నాతో ఉండిపో...
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం

చిత్రం : తలంబ్రాలు (1986) సం
గీతం : సత్యం
సాహిత్యం : రాజశ్రీ
గానం : సుశీల, బాలు

ఏమంటారో నాకు నీకున్న ఇదిని...



ఏమంటారో నాకు నీకున్న ఇదిని...
ఏమంటారో నువ్వు నేనైన అదిని...
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మదిని
చూసే పెదవిని మాటాడే కనులని
నవ్వే నడకని కనిపించే శ్వాసనీ
ఇచ్చిపుచ్చుకున్న మనసుని
ఇదా అదా యధావిధా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదిని...
ఏమంటారో నువ్వు నేనైన అదిని...
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మదిని
ఎదురుగా వెలుగుతున్న నీడని
బెదురుగా కలుగుతున్న హాయిని
తనువునా తొణుకుతున్న చురుకుని
మనసునా ముసురుకున్న చెమటని
ఇష్టకష్టాలని ఇపుడేమంటారో
ఈ మోహమాటాలని మరి ఏమంటారో
స్వల్ప భారాలని ఇపుడేమంటారో
సమీప దూరాలని అసలేమంటారో
జారే నింగిని దొరలాంటి ఈ దొంగని
పాడే కొంగుని పరిమళించే రంగుని
పొంగుతున్న సుధాగంగని
ఇదా అదా అదే ఇదా మరి
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మదిని
జాబిలై తణుకుమన్న చుక్కని
భాద్యతై దొరుకుతున్న హక్కుని
దేవుడై ఎదుగుతున్న భక్తుని
సూత్రమై బిగియనున్న సాక్షిని
పాతలో కొత్తని ఇపుడేమంటారో
పోట్లాటలో శాంతిని మరి ఏమంటారో
తప్పులో ఒప్పుని ఇపుడేమంటారో
గతజన్మలో అప్పుని అసలేమంటారో
నాలో నువ్వుని ఇక నీలో నేనుని
మాకే మేమని మనదారే మనదనీ
రాసుకున్న ఆత్మచరితని
అదా ఇదా ఇదే అదా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదిని...
ఏమంటారో నువ్వు నేనైన అదిని...
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మదిని 
 
Album:Gudumba Shankar

Starring:Pawan Kalyan, Meera Jasmine
Music :Mani Sharma
Lyrics-Chandrabose
Singers :SPB Charan, Harini
Producer:Nagendra Babu
Director: Veera Shankar
Year: 2004

Saturday 3 September 2016

కాలం నేడిల మారెనే పరుగులు తీసెనె



కాలం నేడిల మారెనే పరుగులు తీసెనె
హృదయం వేగం వీడదే వెతికే చెలిమే నీడై నన్ను చేరితే
కన్నుల్లో... నీవేగా.. నిలువెల్లా...
స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెలో ఇలా.. నడిచే క్షణమే
యెద సడి ఆగే ఊపిరి పాడే పెదవిని వీడే పదమొక కవితై
మది నీ వసమై నువ్వు నా సగమై
యెదలో... తోలి ప్రేమే కడలై యెగసే వేల
పసివాడై కెరటాలే ఈ క్షణం చూడనా చూడనా
యెగిరే నింగి దాక ఊహల్నే రెక్కల్లా చేసిందే ఈ భావం
ఓ కాలానే కాజేసే కళ్ళ కౌగిళ్లో కరిగే కలలే
ఓ... వెన్నెల్లో వేధించే వెండి వానల్లో వెలిగే మనమే
మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే
పన్నీటి జల్లై ప్రాణమే తాకే
ఊపిరే పోసే ఇది తొలి ప్రణయం
మనం ఆపినా ఆగదే యెన్నడూ వీడదే

వెళ్లిపోమాకే యెదనే వొదిలి వెళ్ళిపోమాకే
మనసే మరువై నడవాలి ఎందాకే
వెళ్లిపోమాకే యెదనే వొదిలి వెళ్ళిపోమాకే
మనసే మరువై నడవాలి ఎందాకే
భాషే తెలియందే లిపి లేదే కనుచూపే చాలందే
లోకాలంతమైన నిలిచేలా మన ప్రేమే ఉంటుందే
ఇది వరమే..

మనసుని తరిమే చెలిమొక వరమే
మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే
ప్రణయపు కిరణం ఎదకిది అరుణం
కనులకి కనులను యెర వేసిన తొలి తరుణం
మది నదిలో ప్రేమే మెరిసే
యే అనుమతి అడగక కురిసే
నీలో నాలో హృదయం ఒకటై పాడే
కలలిక కనులని వీడదే
మనసిక పరుగే ఆపదే
మనసిక పరుగే ఆపదే
నీలో నాలో నీలో నాలో
నీలో నాలో  పాడే...  


Album: Saahasam Swaasaga Saagipo 
Starring:Naga Chaitanya , Manjima Mohan
Music:A.R Rahman
Lyrics-Sreejo
Singers :Vijay Prakash
Producer:Miryala Ravinder Reddy
Director:Gautham Menon
Year:2016

మెరిసేటి జాబిలి నువ్వే ..





మెరిసేటి జాబిలి నువ్వే .. కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్ .. నను లవ్ లో దించేశావ్

మనసైన వాడివి నువ్వే .. ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే
ఓ మై ఓ మై లవ్ .. నను మైమరపించేశావ్

ఓ మై ఓ మై లవ్ .. టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే  లవ్ ఏమిటంటుంది ? ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది .. ప్రేమందుకోమంది
             
మెరిసేటి జాబిలి నువ్వే .. కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్ .. నను లవ్ లో దించేశావ్
     
అల్లుకో బంధమా ..
ఒంటరి అల్లరి తీరేలా .. జతకానా జవరాలా
ఆదుకో ప్రణయమా ..
తుంటరి ఈడుని ఈ వేళ .. ఓదార్చనా ప్రియురాలా

నా ఆశలన్ని నీ కోసమంటూ నీ దారి చూడని
నా శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడనీ
మసక చీకట్లలో నా మనసు అందించనీ

ఓ మై ఓ మై లవ్ .. టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే  లవ్ ఏమిటంటుంది? ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది .. ప్రేమందుకోమంది
     
మనసైన వాడివి నువ్వే .. ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే
ఓ మై ఓ మై లవ్ .. నను మైమరపించేశావ్
           
కలిసిరా అందమా ..
చుక్కల వీధిన విహరిద్దాం .. స్వర్గాలను చూసొద్దాం
కరగవే సందేహమా ..
చక్కగ దొరికెను అవకాశం .. సరదాగా తిరిగొద్దాం

నీ వాలు కనులు నా పైన వాలి నను మేలుకొలపనీ
నీ వేలి కొనల నా మేను తాకి వీణల్లే మీటని
వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించనీ

ఓ మై ఓ మై లవ్ .. టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే  లవ్ ఏమిటంటుంది? ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది .. ప్రేమందుకోమంది
       
మెరిసేటి జాబిలి నువ్వే .. కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్ .. నను లవ్ లో దించేశావ్
   
ఓ మై ఓ మై లవ్ .. టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే  లవ్ ఏమిటంటుంది? ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది .. ప్రేమందుకోమంది

Album Jayam Manadera

Starring: Chiranjeevi, Soundarya
Music :Vandemataram Srinivas
Lyrics-Sirivennela Sitarama Sastry
Singers :Kumar Sanu, Swarnalatha
Producer:D.Suresh Babu
Director: N.Shankar
Year: 2000

Friday 2 September 2016

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ




స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..
హేల... చారడేసి కళ్ళా...
గుండెల్లో గుచ్చుకున్న ముల్లా...
ఓహో... హో హేల... పువ్వంటి పెదాలా
నా స్వాశనాపే బంగరు బాణాలా...

స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
మధు మంత్రం చవి చూస్తున్నా..
ఓ.. ఓ.. ఓ.. ఓ..
మర యంత్రం ఐపోతున్నా..
అడుగే నన్ను వద్దన్నా పరుగే ఇక ఆగేనా
ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా...
నాలో ప్రేమనూ నీ కానుకివ్వగా
అర చేతులందు మొలిచెను పూవనం
నీ వల్లనే చెలీ
నా గుండే లోతుల్లో
ఓ పాలపుంత పేలిన సంబరం...

స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
కనురెప్పల దోచెలి చాచా
ఓ.. ఓ.. ఓ.. ఓ..
కలలోకి నిన్నే పిలిచా
తొలి చూపున ప్రేమించా
మలి చూపున మనసిచ్చా
నిదురకి ఇక సెలవిచ్చా
నీ సాక్షిగా
పరిచయమే ఓ పరవశమై
నను పదమందే నీ నీడగా
నా జత సగమై రేపటి వరమై
నువ్వూంటావా నా తోడుగా..

స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..

 Album: Bhale Bhale Magadivoy
Starring:Nani, Lavanya Tripathi
Music: Gopi Sunder
Lyrics-Ramajogayya Shastri
Singers : Sachin Warrier
Producer: Geetha Arts, UV Creations
Director: Maruthi Dasari
Year: 2015

టట్టటార టట్టటారర టారట్టటార



నీలిమేఘాలు..
నీలిమేఘాలు ఆకాశవీధిలో ఆడుకునే మెరుపుకన్నె
నీలిమనే అమ్మాయే ఈ నేలకు వచ్చేసిందని
ఆమెను అన్వేషిస్తూ వచ్చిన దివిదూతలు

నీలిమేఘాలు..
నీలిమేఘాలు.. ఉరుముతున్న గొంతులెత్తి దిగంతాల్ని పిలుస్తూ
ఆమె కొరకు బహుమతిగా హరివిల్లుని చూపిస్తూ
నీలిమా నీలిమా అని కలవరించే నీలాంబరి రాగాలు

నీలిమేఘాలు..
నీలిమేఘాలు.. చల్లని స్నేహపు జల్లుల చిరుగాలుల చేతులతో
ఆమె మేని వయ్యారాల సీమనంతా స్పర్శిస్తూ
చిరకాలపు నేస్తానికి చేరువైన సరాగాలు

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

ఆకాశంలో నీలిమబ్బులై ఊరేగే ఊహలు
అమ్మనువదిలి ఆకతాయిలై పరిగెత్తే పాపలు
అవి చిరుజల్లుల్లో చిట్టిచినుకులై తిరిగొచ్చే వేళ
తను చిగురిస్తుంది పులకరింతలై నాగుండెల నేల

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

కుదురుగ ఉంటే మంచుబొమ్మలా ఊగిపోదా హృదయం
కులికందంటే వనమయూరిలా ఆగిపోదా కాలం

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

కల్లోకొచ్చి కోటితారలు కవ్విస్తాయెందుకో
తళతళలన్నీ కోసుకొమ్మని ఊరిస్తాయెందుకో
నే చిటికెలుకొడితే తారలు మొత్తం తలవంచుకు రావా
నా పెరటితోటలో మంచుబొట్లుగా కల నిజమే కాదా

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

గాలికి ఊగే జాజితీగలా నాజూకు జాణ
గగనాన్నైనా నేలకు దించే ఈ శ్రావణ వీణ

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

ఎల్లలులేని గాలిపటంలా ఎగిరేటి కోర్కెలు
జాబిలితోనే ఊసులాడుతూ రాసుకున్న లేఖలు
అవి దారంతెగితే తీరం లేని ఆవారా ఆశలు
ఆధారం ఉంటే అష్టదిక్కులు పాలించే రాణులు

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

లావణ్యాన్నే చూపగలిగిన అంతటి రవివర్మ
ఆంతర్యంలో అంతుదొరకని సొగసు చూపతరమా

టట్టటార టట్టటారర టారట్టటార
టట్టటార టట్టటారర టారట్టటార

చిత్రం : సొగసు చూడ తరమా (1995)
సంగీతం : రమణి-ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం : బాలు, ఎస్. పి. శైలజ, రోహిణి

ప్రేమ దేశం యువరాణీ


ప్రేమ దేశం యువరాణీ
పూత ప్రాయం విరిబోణీ
ఏరి కోరి మెచ్చావే ఈ తోటరాముడ్నీ
ఆకతాయి అబ్బాయీ
హాయ్ పిలుపుల సన్నాయీ
మనసు పైనే చల్లావే మంత్రాల సాంబ్రాణీ
నా కనులూ నా కలలూ నిన్నే చూస్తున్నాయి
రావోయీ రావోయీ 
సిరి సిరి లేత సొగసుల మధుపాయి
దాయి దాయి దావోయీ 
తీగ నడుమిటు తేవోయీ
లాయి లాయి లల్లాయీ 
తీపి తికమక రాజేయీ
బాపురే మెరుపులు వేయీ 
తలపులూ సుడి తిరిగాయీ
చందన చర్చల తొందర మొదలయ్యే
జాకురే వలపు సిపాయి 
గెలుచుకో కలికితురాయి
రావోయీ రావోయీ 
సిరి సిరి లేత సొగసుల మధుపాయి
అందనంటు నీ పరువం 
ఎన్ని పరుగులు తీసిందో
ఆగనంటు నీ విరహం 
ఎంతగా వల విసిరిందో
నిన్నటికి మొన్నటి మొన్న 
జన్మ నీ వశమనుకున్న
నువ్వే నేనోయ్ నేనే నువ్వోయీ
నీ రుణం ఎన్నటికైనా యవ్వనం నీదనుకోనా
రావోయీ రావోయీ 
సిరి సిరి లేత సొగసుల మధుపాయి
ప్రేమ దేశం యువరాణీ
పూత ప్రాయం విరిబోణీ
ఏరి కోరి మెచ్చావే ఈ తోటరాముడ్నీ
ఆకతాయి అబ్బాయీ
హాయ్ పిలుపుల సన్నాయీ
మనసు పైనే చల్లావే మంత్రాల సాంబ్రాణీ
నా కనులూ నా కలలూ నిన్నే చూస్తున్నాయి
రావోయీ రావోయీ 
సిరి సిరి లేత సొగసుల మధుపాయి

Album Shakti
Starring: Jr.NTR, Iliana
Music :Mani Sharma
Lyrics-Ramajogayya Shastry
Singers :Hemachandra, Saindhavi
Producer: C. Ashwini Dutt
Director:Meher Ramesh
Year: 2011

Thursday 1 September 2016

ఎవరో..అతనెవ్వరో..అతిధిగ వచ్చాడూ




ఎవరో..అతనెవ్వరో..అతిధిగ వచ్చాడూ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ
ఎవరో..తను ఎవ్వరో..ఎదురే వచ్చిందీ
వివరం ఏం చెప్పనూ..విరహం రేపిందీ

తెలవారే వేళా..కలగన్నా తననే..
అది ప్రేమో ఏమో..ఏమిటో

ఎవరో..తను ఎవ్వరో..ఎదురే వచ్చిందీ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ

అణువణువు అతని తలపే వేధించసాగే
అనుదినమూ అతని కధలే వినిపించెనే
చెలి మనసు అడిగి మనసు వెంటాడ సాగే
తొలి వలపో..జతకు పిలుపో బదులే రాదే

మనసుంటే నేరం .. మనసంతే భారం
నిలిచేనా ప్రాణం .. ఒంటిగా

ఎవరో..తను ఎవ్వరో..ఎదురే వచ్చిందీ
వివరం ఏం చెప్పనూ..విరహం రేపిందీ
హో..ఓఓ..ఎవరో..అతనెవ్వరో..అతిధిగ వచ్చాడూ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ

ఓ..పరిచయమే ఓ పరిమళమై గంధాలు పూసే
పరువమిలా ఓ పరవశమై గ్రంధం రాసే
ప్రతినిముషం బ్రతుకు సుఖమై ఉయ్యాలలూగే
జతకలిసే అతని కొరకే ఎదురే చూసే

హౄదయం లో దాహం..తడిపే ఓ మేఘం
ఎపుడూ నీ స్నేహం..ఓ ప్రియా

ఎవరో..అతనెవ్వరో..అతిధిగ వచ్చాడూ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ
తెలవారే వేళా..హా.. కలగన్నా తననే.. హా..
అది ప్రేమో.. హా..ఏమో..ఏమిటో

చిత్రం : అభి (2004)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : వేటూరి
గానం : సాగర్, సుమంగళి

పూలనే కునుకేయమంటా ఐ(మనోహరుడు) (2014)



 పూలనే కునుకేయమంటా 
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా 
పూలనే కునుకేయమంటా 
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా 
హే ఐ అంటే మరి నేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా 
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
అసలిపుడు నీకన్న ఘనుడు లోకాన కనబడునా మనిషై
అదిజరగదని ఇలా అడుగువేసినా నిను వలచిన మనసై
ప్రతి క్షణము క్షణము నీ అణువుఅణువులను కలగన్నది నా ఐ
ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై
నా చేతిని వీడని గీత నువ్వై నా గొంతుని వీడని పేరువి నువ్వై
తడిపెదవుల తళుకవనా నవ్వు నవ్వనా ఎంత మధురం
పూలనే కునుకేయమంటా 
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా
పూలనే కునుకేయమంటా 
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
నీరల్లే జారేవాడే నాకోసం ఒక ఓడయ్యడా
నీడంటు చూడనివాడే నన్నే దాచిన మేడయ్యడా 
నాలోన వుండే వేరొక నన్నే నాకే చూపించిందా
నారాతి గుండెని తాకుతు శిల్పంగా మార్చేసిందా
యుగములకైనా మగనిగ వీణ్ణే పొగడాలి 
అంటూ ఉంది నాలో మనసివ్వాళే
ప్రతి ఉదయానా తన వదనాన్నే 
నయనము చూసేలాగా వరమేదైనా కావాలే
పూలనే కునుకేయమంటా 
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా 
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా
పూలనే కునుకేయమంటా 

తనువచ్చెనంటా... తనువచ్చెనంటా


Album I – Manoharudu
Starring:Vikram, Amy Jackson
Music :A. R. Rahman
Lyrics-Anantha Sriram
Singers :Haricharan, Shreya goshal
Producer:V Ravichandran, D. Ramesh Babu
Director:Shankar
Year:2014

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో




ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో
ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ

అవునో .. కాదో .. అడగకుంది నా మౌనం
చెలివో .. శిలవో .. తెలియకుంది నీ రూపం

చెలిమి బంధమల్లుకుందే .. జన్మ ఖైదులా

ఎదుట నిలిచింది చూడు

నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేకా  విసుక్కుంది నా కేకా

నీదో  .. కాదో .. వ్రాసున్న చిరునామా
ఉందో .. లేదో .. ఆ చోట నా ప్రేమా

వరం లాంటి శాపమేదో సొంతమైందిలా

ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో

ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా
ఎదుట నిలిచింది చూడు

 Album:Vaana
Starring:Vinay Rai, Meera Chopra
Music :Kamalakar
Lyrics-sirivennela
Singers :Karthik
Producer:M. S. Raju
Director:M. S. Raju
Year: 2008
</div>