Sunday 14 August 2016

నేనీదరిని నువ్వా దరినీ


నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

కనకదుర్గ కనుసన్నలలో గలగల పారే తన ఒడిలో
కనకదుర్గ కనుసన్నలలో గలగల పారే తన ఒడిలో
మన పడవలు రెండూ పయనించాలని
బ్రతుకులు నిండుగ పండించాలని
కలిపింది ఇద్దరినీ... కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నీ కురుల నలుపులో... నీ కనుల మెరుపులో
అలలై... కలలై... అలలై కలలై తానే వెలిసింది
నీ లేత మనసులో... నీ దోర వయసులో
వరదై... వలపై... వరదై వలపై తానే ఉరికిందీ

చిరుగాలుల తుంపరగా... చిరునవ్వుల సంపదగా
చిరుగాలుల తుంపరగా... చిరునవ్వుల సంపదగా
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

పంట పొలాల్లో పచ్చదనంగా పైరగాలిలో చల్లదనంగా
పంట పొలాల్లో పచ్చదనంగా పైరగాలిలో చల్లదనంగా
పల్లెపదంలో తీయదనంగా
చిరంజీవులై జీవించాలని
కలిపింది ఇద్దరినీ... కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

చిత్రం : బంగారు బొమ్మలు (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.